లాక్‌డౌన్‌పై మే 3వ తేదీ తరువాత నిర్ణయం తీసుకుంటామని ప్రధాని అన్నట్లు సమాచారం. కరోనా వ్యాప్తి ఉన్నచోట్ల లాక్‌డౌన్ కొనసాగుతుందని పేర్కొన్నట్లు తెలిసింది. కరోనా ప్రభావం తక్కువున్న రాష్ర్టాల్లో, జిల్లాల వారిగా సమీక్షిస్తామని వెల్లడించారు. ఆర్థిక వ్యవస్థ గురించి ఆందోళన చెందవద్దని సీఎంలతో అన్నట్లు తెలిసింది. దేశ ఆర్థిక వ్యవస్థ బాగుందని సీఎంలతో మోదీ పేర్కొన్నారు.